Kalyan Jewellers India Limited - Articles

సెలబ్రిటి-ప్రేరేపిత జ్యువెలరీ స్టైల్స్ – పార్టీ ఎడిట్

Publisher: blog

సెలవుల సీజన్ వచ్చేసింది, పండగల సమయంలో కలుసుకున్నప్పుడు మెరిసే సమయం అని దీని అర్థం. మీ సెలవుల స్టైల్ లో మీరు అందాన్ని నింపాలని కోరుకుంటే, నిస్సందేహంగా అందరూ మీ వైపు ఆకర్షించబడేలా కొన్ని సెలబ్రిటి-ప్రేరేపిత జ్యువెలరీ స్టైల్స్ ని పరిశీలించండి.

 

నిరాండబరత సొగసుదనాన్ని ఏదీ అధిగమించలేదు. నిరాడంబరతలో తిరస్కరించబడలేని ఆకర్షణ ఉంది, ఇది ఎల్లవేళలా అందమైన నటిగా చెప్పబడిన కేజే బ్రాండ్ అంబాసిడర్ రశ్మిక మంధన్న ద్వారా వర్ణించబడింది. డబల్-లేయర్ గల డైమండ్స్ అమర్చిన చోకర్ నెక్లెస్ ను ఎంచుకోవడం ద్వారా ఆమె స్టైల్ ను అనుసరించండి. క్లాసిక్ డ్రాప్ ఇయర్ రింగ్స్ తో జత చేయండి మరియు స్టార్ వలే మెరవండి. అలంకారయుతమైన బ్యాంగిల్స్  సెట్ మీ పూర్తి రూపానికి పండగ భావనను, ఉల్లాసాన్ని ఇస్తాయి. మీ వ్యక్తిత్వాన్ని చూపించే పరిశీలనాత్మక నైపుణ్యం కోసం వివిధ డిజైన్స్ మిక్స్ అండ్ మ్యాచ్ చేయండి.

 

సంప్రదాయబద్దమైన కార్యక్రమాల కోసం మీరు బంగారం అందాన్ని అనుసరించడాన్ని ప్రేమిస్తే, మరాఠీ నటీమణి మరియు మా బ్రాండ్ అంబాసిడర్ –పూజా సావంత్ ను అనుసరించి సంప్రదాయబద్ధమైన టెంపుల్ డిజైన్స్ అలంకరించండి. పొడవైన హారం మరియు జత కలిసే పొట్టి నెక్లెస్ లు మీ సంప్రదాయబద్ధమైన రూపానికి సొగసుదనం చేరుస్తాయి. ఝుంకాస్ వంటి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ను ఎంచుకోవడం ద్వారా మీ సంప్రదాయబద్ధమైన రూపాన్ని పెంచండి మరియు అందమైన పాపిట గొలుసు ధరించి మీ అందాన్ని రెట్టింపు చేయండి. మీరు లెహంగా లేదా శారీ కట్టుకుంటే, గోల్డ్ బెల్ట్ లేదా వడ్డాణంతో మీ అందాన్ని పెంచండి. సింగిల్ గోల్డ్ కడాతో లేదా వివిధ రకాల బ్యాంగిల్స్ తో మీ రూపాన్ని పూర్తి చేయండి మరియు ఆకర్షణీయమైన రింగ్ తో స్టేట్మెంట్ చేయడాన్ని మర్చిపోవద్దు. గోల్డ్ చేర్చడం వలన మీ రూపానికి గొప్పదనం చేకూరుతుంది, మీరు పండగల సందర్భంలో జనాల మధ్యలో మిమ్మల్ని ప్రత్యేకంగా ఉంచడాన్ని నిర్థారిస్తుంది.

 

అందర్నీ ఆకర్షించే క్రిస్మస్ పార్టీ రూపం కోసం , నటీమణి మరియు కేజే బ్రాండ్ అంబాసిడర్ వామికాగబ్బీ నుండి ప్రేరేపణ పొందండి. అందమైన మరియు ఆకర్షణీయమైన డైమండ్ నెక్లెస్ మిమ్మల్ని ప్రధాన ఆకర్షణగా ఉంచుతుంది. ఇది మిమ్మల్ని ఏ పార్టీలోనైనా మెరిపిస్తుంది మరియు మీరు నిజమైన తార వలే మెరుస్తారు. నెక్లెస్ ను మెరిసే డైమండ్ డ్రాప్ ఇయర్ రింగ్స్ తో జత చేయండి. సింగిల్-డైమండ్ బ్యాంగిల్స్ ను చేర్చి మీ రూపాన్ని పూర్తి చేయండి. అందాన్ని చేర్చడానికి మీరు డైమండ్స్ అమర్చిన బ్రాస్ లెట్స్ ను కూడా ధరించవచ్చు. రంగు యొక్క డిజిటల్ ప్రభావం కోసం కాంట్రాస్టింగ్ మరకతం రాళ్లతో అమర్చిన డైమండ్ స్టేట్మెంట్ రింగ్స్ ఎంచుకోండి. ఈ రూపంతో, క్లాసీ సొగసుదనం అంతా మీదే!

 

పోల్కి జ్యువెలరీకి ఏ సందర్భానికైనా ప్రత్యేకమైన స్థానం ఉంది మరియు గుజరాతీ నటీమణి మరియు కేజే బ్రాండ్ అంబాసిడర్ కింజల్ రాజ్ ప్రియ నైపుణ్యంతో దాని సొగసుదనం ప్రదర్శించింది. మీ రూపాన్ని మెరుగుపరచడానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ తో అందమైన కుందన్ నెక్లెస్ ను జత చేయండి. మీరు ధరించాలని ప్రణాళిక చేస్తున్న సంప్రదాయబద్ధమైన రూపానికి కాంట్రాస్టింగ్ రంగుల జ్యువెలరీని చేర్చడం ద్వారా మీ రూపాన్ని స్టైల్ గా చేయండి. అది ప్రస్ఫుటంగా కనిపించడమే కాకుండా, బోల్డ్ గా మరియు అందమైన భ్రమను కూడా కల్పిస్తుంది. ప్రతి చేతికి మీనాకారి లేదా కుందన్ డిజైన్ లో సింగిల్ కడా మరియు స్టేట్మెంట్ రింగ్ చేర్చండి మరియు ఏదైనా పార్టీలో మెరవడానికి సిద్ధంగా ఉండండి.

 

ఈ హాలీడే సీజన్ లో, మీ జ్యువెలరీని మాట్లాడనీయండి మరియు మీరు అభిమానించే సెలబ్రిటీస్ యొక్క స్టైల్ ఎంపికలు నుండి ప్రేరేపణ పొందండి. మీరు మినిమల్ రూపంలో ఉన్నా, చోకర్ ట్రెండ్ కోసం ఆరాటపడుతున్నా, డైమండ్ మెరుపులు లేదా బంగారం అందం, స్టేట్మెంట్ రింగ్స్, బ్యాంగిల్స్, లేదా పోల్కి జ్యువెలరీ యొక్క శాశ్వతమైన సొగసుదనం చేర్చాలని కోరుకుంటున్నా ప్రతి అభిరుచి కోసం సెలబ్రిటి-ప్రేరేపిత స్టైల్ ఉంది. కాబట్టి ముందుకు వెళ్లండి, మీ యొక్క నిజమైన వ్యక్తిత్వపు తారలా మెరవండి మరియు ఆ సెలవుల పార్టీస్ లో స్టేట్మెంట్ చేయండి!