My Kalyan Mini Store, Hospital Road, Gudur

7-202, Ward No-1, Sangam Theater Hospital Road
Gudur- 524101

040-71328059

Call Now

Opens at

Articles

డైమండ్స్ ఈ పండగ సీజన్ కి మరియు అంతకు మించి కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తాయి.

On
డైమండ్స్ శాశ్వతమైనవి. అందమైన డైమండ్లతో, ప్రకాశవంతమైన డిజైన్లతో మెరిసే జూవెల్లరీ సెట్ ని కొనుగోలు చేయడానికి మీకు ఎప్పుడూ కూడా ఏదైనా కారణం అవసరం లేదు. ప్రతి సందర్భానికి సరిపోయే మార్గాన్ని డైమండ్లు కనుగొంటాయి. అది పండగ కావచ్చు, వివాహం లేదా సాధారణ సందర్భం, వినోదాలతో నిండిన సాయంత్రం కావచ్చు, డైమండ్స్ మీ ప్రత్యేకమైన రోజుకి మెరుపుని తెస్తాయి. శీతాకాలం సమీపించడంతో , వివాహాలు మరియు చుట్టూ కూడా పూర్తి పండగ అనుభూతి ఉండే సంవత్సరంలోని సమయం ఇది. మీరు త్వరలోనే పెండ్లి కుమార్తె కాబోతుంటే, మీరు అగనవసరం లేదు; మీరు అత్యంత విలాసవంతంగా మరియు సాధ్యమైనంత ఆర్భాటంగా అలంకరించుకోవాలి, ఎందుకుంటే ఇది మీ ప్రత్యేకమైన రోజు . మీరు సౌందర్యరాశిగా కనిపించాలని కోరుకుంటారు, మీరు ధరించే వాటి పై కోట్లు ఖర్చు పెట్టడం గురించి మీరు వెనుకాడని రోజు ఇది. మీ ప్రత్యేకమైన రోజు నీడు మెరిసే డైమండ్స్ మరియు రత్నాలతో ప్రకాశించే జూవెల్లరీ పీసెస్ పై పెట్టుబడి పెట్టండి. డైమండ్స్, కెంపులు, పచ్చలతో సుసంపన్నమైన భారతీయ కళాపనితనానికి నివాళులు అర్పించే మెరిసే పాపిట గొలుసు (బిళ్ల)ని తల పై ధరించే చెయిన్స్ తో కలిపి ధరించండి. సంప్రదాయబద్ధమైన మరియు స్వచ్ఛమైన పెండ్లి కుమార్తె రూపం పూర్తి కావడానికి ఈ హెడ్ ముక్కురాయిని నత్తుతో కలిపి ధరించాల్సిందిగా మేము సూచిస్తాము. సుసంపన్నమైన సొగసుని ప్రదర్శించే సున్నితమైన మరియు మృదువైన సంగీతాల మధ్య వివాహాన్ని ఇది తెస్తుంది. మీరు వివాహానికి హాజరవుతుంటే, సీతా హారం వంటి పొడవైన నెక్లెస్ తో లేదా వివిధ పొడవులలో ఉండే ఎన్నో నెక్లెస్ లతో పాటు చోకర్ ధరించండి మరియు దేవతా కన్య వలే కనిపించడానికి సంపూర్ణమైన చీర ధరించండి. అవి ఒక దానిని మరొకటి కప్పి ఉంచకుండా , ఒక దాని పై మరొకటి ఉండకుండా నిర్థారించండి. అయితే, జూవెల్లరీ పీసెస్ లో ఉపయోగించిన జూవెల్స్ ని బాగా అలంకరించవలసిన అవసరం ఉంది. మిక్స్ అండ్ మ్యాచ్, అసాధారణమైనవి ఎంచుకోండి, స్వచ్ఛమైన పోల్కి మరియు ముత్యాలతో పాటు వివిధ రంగుల రాళ్లతో మృదుత్వం మరియు ప్రకాశవంతమైన రూపాన్ని సృష్టించండి. మీకు వివాహం నిశ్చయించబడితే, మీ పెండ్లి కుమార్తె దుస్తువుల ఎరుపు, బంగారం మరియు సమృద్ధియైన జరీ పనితనంతో ఉంటే, ఇయర్ రింగ్స్ మరియు బ్యాంగిల్స్ తో డైమండ్ మరియు పచ్చల బంగారం చోకర్ నెక్లెస్ ని ఎంచుకోండి. సూక్ష్మంగా డిజైన్ చేసిన ఆభరాణాలతో మీ రూపాన్ని పూర్తి చేయండి. బంగారం జూవెల్లరీ సెట్ కి డైమండ్స్ మరియు ముత్యాలతో అలంకరించినప్పుడు గోధుమ ఛాయలకి పూరకంగా ఉంటాయి. మీరు శాశ్వతమైన మరియు మరియు ఘనంగా కనిపించే టెంపుల్ జూవెల్లరీని ఎంచుకోవచ్చు. తమ సంప్రదాయబద్ధమైన డిజైన్లు మరియు నమూనాలతో టెంపుల్ జ్యువలరీ శాశ్వతమైన ఆర్భాటాన్ని ప్రతిఫలింప చేస్తుంది. ఇంకా, హ్యాండ్ చెయిన్ వంటి ప్రసిద్ధి చెందిన మరియు విలక్షణమైన పీసెస్ లేకుండా వివాహ రూపం అసంపూర్ణంగా ఉంటుంది. బ్రాస్ లెట్ కి లింక్ చేసే చెయిన్స్ తో ఈ రింగ్స్ ఎంతో అందంగా ఉంటాయి మరియు మీ చేతుల యొక్క సున్నితమైన అందాన్ని పెంపొందిస్తాయి. ఈ ఆభరణం ఏదైనా పండగ రూపాన్ని మరింత మెరిసేనిధంగా మరియు స్త్రీ స్వభావంగా చేస్తుంది. ఆకట్టుకునే విధంగా ఉండే ఈ రింగ్స్, బ్రాస్ లెట్స్ తరచుగా డైమండ్స్ మరియు స్టోన్స్ మరియు పచ్చలతో అలంకరించబడి ఉంటాయి. భారతీయ వివాహానికి తప్పనిసరిగా ఉండవలసిన మరొకటి డైమండ్ షాండ్లియర్ ఇయర్ రింగ్స్ జత. డైమండ్లతో అలంకరించబడిన షాండ్లియర్ ఇయర్ రింగ్స్ తో మీరు ప్రత్యేకంగా కనిపించడానికి అర్హులవుతారు. డైమండ్ షాండ్లియర్ ఇయర్ రింగ్స్ జతకి రత్నాల రూపంలో కొంచెం రంగుని చేరిస్తే అది మరింత విలక్షణంగా ఉంటుంది. అత్యంత అసాధారణమైన మరకతాలతో మెరిసే డైమండ్స్ ఎల్లప్పటికీ మీరు అభిమానించే కలయిక. శాశ్వతమైన తరగతి మరియు సొగసుదనంతో సంవత్సరాల తరబడి నిలిచే డైమండ్లతో మెరిసే అద్భుతమైన పీసెస్ లో పెట్టుబడి పెట్టడం విలువైన అంశం. డైమండ్స్ పోల్కి జూవెల్లరీలో ఒక మెరిసే భాగం. పోల్కి జూవెల్లరీలో అన్ కట్ డైమండ్స్ యొక్క వాడకం వాటిని ప్రత్యేకంగా, విలక్షణంగా మరియు ఆకర్షణీయంగా చేస్తుంది. అన్ కట్ డైమండ్స్ తమ స్వచ్ఛమైన రూపంలోని డైమండ్స్ ని సూచిస్తాయి. మీరు పోల్కి జూవెల్లరీ పీస్ ని కొనుగోలు చేసినప్పుడు, మీరు శుద్ధి చేయబడని డైమండ్ ని కొనుగోలు చేస్తున్నారు. అవి పెండ్లి కుమార్తె మెరిసే రూపానికి జతగా చిలిపితనంతో సొగసుని వెదజల్లుతాయి. ప్రతి సందర్భానికి మరియు దుస్తులకి నప్పే చాంద్ బాలీస్ ని మనం ఇష్టపడతాము. పని సామర్థ్యం కోసం బహుళ పొరలు గల పోల్కి డైమండ్ నెక్లెస్ ల్ని యథాతథంగా ఎంచుకోవచ్చు లేదా కెంపులు వంటి అందమైన రత్నాల్ని చూపించడానికి వాటిని రివర్స్ చేయవచ్చు. వివాహాల కోసం మాత్రమే కాకుండా, శీతాకాలాలు కూడా పార్టీల కోసం అనుకూలమైనవి. వైన్-రెట్ డ్రెస్ లేదా నలుపు రంగు శాటిన్ ధరించండి మరియు సిగ్నేచర్ సాలిటైర్ రింగ్ తో జత చేయండి. పాశ్చాత్య ఫ్యాషన్ భారతీయ వారసత్వం యొక్క కలయికని సృష్టించడానికి డ్రాప్ లెట్ ఇయర్ రింగ్స్ లేదా ఇయర్ కఫ్ లో పెట్టుబడి పెట్టండి. ఐశ్వర్యం అంశం వలన నవరత్న జూవెల్లరీ పెండ్లి కుమార్తెలలో ఎంతగానో ప్రసిద్ధి చెందుతుంది. అవి డైమండ్స్ మరియు రత్నాల్ని కలిపి మీ ఆభరణాలకు రంగులు చేరుస్తాయి మరియు మీ వివాహం సంస్కారాల రోజు మంచి అదృష్టం కోసం జాతకపరమైన సమతుల్యాన్ని మూర్తీభవిస్తాయి. కాలర్డ్ నవరత్న నెక్లెస్ మీరు రాచఠీవీతో కనిపించేలా మరియు అనుభూతి చెందేలా చేస్తుంది. ఆధునికమైన మార్పుతో సంప్రదాయబద్ధమైన రూపం మీరు ఎంచుకుంటే నవరత్న జ్యువలరీ మీకు సక్రమంగా సరిపోతుంది. చివరిగా, జాదు జూవెల్లరీ ; దీనిలో పోల్కి, కుందన్, మీనాకారి జూవెల్లరీ గలవు. జాదు జూవెల్లరీ అత్యంత సంపన్నమైన జూవెల్లరీ రూపాల్లో ఒకటి. ఎందుకంటే ఇది దాదాపు ఎప్పుడూ చేతితో తయారైనదే; ప్రతి పీస్ ని తయారు చేయడానికి మూడు నుండి నాలుగు నెలల సమయం కావాలి. మీరు కొనుగోలు చేసే ప్రతి పీస్ ఆభరణం ప్రేమ, శ్రమ సంవత్సరాలు మరియు కళాకారుడి ప్రతిభకు నిదర్శనం. ఈ పీసెస్ మొగలులు, రాజపుత్రుల కాలానికి చెందినవి. మీ ప్రత్యేకమైన రోజు నాడు మీకు అర్హమైన విలాసానికి అవి వాటిని పరిపూర్ణం చేస్తాయి. డైమండ్స్ మరియు ఇతర అటువంటి విలువైన స్టోన్స్ అనగా ముత్యాలు, కెంపులు, పచ్చలతో ప్రతి పీస్ తయారైనవి కానీ చాలా వరకు డైమండ్స్ స్వచ్ఛమైన బంగారం పై అనగా 22-24 కే పై చోటు చేసుకున్నాయి. డైమండ్స్ మరియు కెంపులతో జాదు పంచ్ లాడా మీ పెండ్లి కుమార్తె కలక్షన్ కి ఒక సాటిలేని చేరిక. బహుళ పొరల పోల్కి డైమండ్ నెక్లెస్ తో పచ్చ మరియు డైమండ్ చోకర్ ని జత చేయడం ద్వారా ఆధునిక రూపంతో పాత ప్రపంచపు అందాన్ని వెలువరిస్తుంది. అదే విధంగా, డైమండ్స్ అమర్చిన గోల్డ్ జూవెల్లరీ సంగీత్ లేదా మెహందీకి అందాన్ని చేరుస్తుంది. ఆంధ్రా పెండ్లి కుమార్తెలు నుండి ప్రేరణ పొంది, కమర్ బంధ్ (వడ్డాణం) మరియు మనోహరమైన బంగారం మరియు డైమండ్స్ లో నైపుణ్యమున్న కళాకారులుచే సూక్ష్మంగా డిజైన్ చేసిన బ్యాంగిల్స్ చేర్చాల్సిందిగా మేము సిఫారసు చేస్తాము. డైమండ్స్ కి మారిపోయే స్వభావం ఉంది. అవి ఒంటరిగా మెరుస్తాయి మరియు ఇతర లోహాలు మరియు స్టోన్స్ తో కలిసి కూడా అంతే అందంగా కనిపిస్తాయి. కాబట్టి నాజూకైన పీసెస్ మిశ్రమంతో మరియు పాశ్చాత్య మరియు భారతీయ దుస్తువుల రెండిటికీ సులభంగా జత కలిసే ఒక కలక్షన్ ని తయారు చేయండి. ఆర్భాటం, సొగసుదనం, పనితనం మరియు విలువల మధ్య సమతౌల్యాన్ని ,అంతిమంగా స్టైల్ మరియు ఫ్యాషన్ ని తీసుకురావడమే ఉద్దేశ్యం.
Publisher: Kalyan Jewelers

కల్యాణ్ జూవెల్లర్స్ నుండి తేలిక బరువు గల ఎంపికలతో శ్రమ లేకుండా సొగసుగా ఉండండి.

On
తేలిక బరువు గల జూవెల్లరి భావన వెనక ఉన్న ఆలోచన ఏమంటే ఆచరణీయత. మీ సేఫ్ లో ఉండే జూవెల్లరి పీస్ కి బదులు ప్రతిరోజూ ధరించగలిగేది ఏదైనా సృష్టించడం. సంప్రదాయబద్ధంగా, జూవెల్లరి పీస్ లు అంటే ప్రత్యేకమైన సందర్భాలలో మాత్రమే మహిళలు ధరించే భారీగా , సూక్ష్మంగా డిజైన్ చేయబడిన పీస్ లు. ప్రతి భారతీయ మహిళ బంగారాన్ని అందం, సుసంపన్నత మరియు దీర్ఘకాల సొగసుతనం యొక్క చిహ్నంగా పరిగణిస్తుంది. అదనంగా, చారిత్రకంగా, అన్ని రకాల సమస్యలకు మహిళలకు ఆర్థికపరమైన రక్షణ కోసం ' స్త్రీ ధనంగా ' పెండ్లి కుమార్తెలకు బంగారం ఇవ్వబడుతోంది. మన గొప్ప ఇతిహాసాలు, చారిత్రక సూచనలలో మరియు సింధు లోయ నాగరికత యొక్క జాడల నుండి సూక్ష్మంగా డిజైన్ చేయబడిన మరియు సుసంపన్నమైన గోల్డ్ జూవెల్లరి పీసెస్ యొక్క సూచనల్ని మరియు సామాజిక తరగతి, అధికారం వెర్సెస్ ఈ లోహాన్ని కలిగి ఉన్న ప్రభావాన్ని ఎవరైనా తెలుసుకోవచ్చు. కాలం మారింది. అందువలన మన జీవితాలు కూడా. కానీ, మన కుటుంబాలు మనకు అప్పగించిన గోల్డ్ జూవెల్లరిని ఇంకా మనం ఆనందిస్తున్నాము. వారసత్వపు జూవెల్లరి పీస్ ని కలిగి ఉండటం మరియు సమకాలీన స్టైల్ తో దానిని జత చేసి ధరించడం ఒక పరిపూర్ణమైన భావనని కలిగిస్తుంది. మనం ప్రతిరోజూ గోల్డ్ ధరించడాన్ని ఇష్టపడతాము. ఆ విధంగా తేలిక బరువు గల జూవెల్లరిని కొనుగోలు చేసే పోకడ ఊపందుకుంది. అదనంగా, బంగారం ధరలు అన్ని సమయాల కంటే అధికంగా ఉన్నప్పుడు, పసుపు లోహం తేలిక రకం మిల్లీనియల్ మరియు యువ పెట్టుబడిదారుల్ని ఆకర్షిస్తుంది. ఆధునిక మహిళ తమ కెరీర్లు మరియు కుటుంబాన్ని సమానంగా నిర్వహించడానికి నిరంతరం శ్రమిస్తున్నట్లే, సొగసైన మరియు ప్రభావవంతమైన జూవెల్లరి మరియు వారి జీవనశైలుల్ని అపురూపం చేస్తున్నాయి. ఇది మాత్రమే కాకుండా, మీ స్టైల్ కి సరిపడే పీస్ తో మీరు ఒక పార్టీలో ప్రత్యేకంగా కనిపించడానికి మీరు బ్యాంకుని దోచుకోవలసిన అవసరం లేదని తేలికపాటి జూవెల్లరి నిరూపించింది. తేలికగా ఉండే జూవెల్లరి పోకడ ఇక్కడ ఉండటానికి ఇవి మాత్రమే కారణాలు కావు కానీ కొన్ని కారణాల్లో అవి కూడా ఉన్నాయి మరియు తేలికగా ఉండే జూవెల్లరిని ప్రేమించడానికి మరికొన్ని కారణాలు ఇవి: తేలికగా గల జూవెల్లరిని ధరించడం మరియు తీసుకువెళ్లడం సులభం. జూవెల్లరి గురించి పరిశీలించినప్పుడు మన సౌకర్యం గురించి మొదటగా ఆలోచిస్తాము. ఉదాహరణకు, భారీగా ఉండే ఇయర్ రింగ్స్ తో మీ చెవి తమ్మెల్ని క్రిందకు జారుతున్నట్లుగా మరియు వాటి నుండి రక్తం కారుతున్నట్లు లేదా నొప్పి కలుగుతున్నట్లు మీరు గమనించారా? భారీ , సంప్రదాయబద్ధమైన నెక్లెస్ అందంగా కనిపించినంత విధంగా మీరు ధరించినప్పుడు, అది వేసవి మధ్యాహ్నం సమయంలో జూవెల్లరి నిర్బంధంగా మారుతుంది. మీ ఆకర్షణీయమైన కాటన్ దుస్తులకి జతపడే ఒకటి మీరు కోరుకుంటారు. కల్యాణ్ జూవెల్లర్స్ నుండి తేలికైన బరువు గల బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ లేదా నెక్లెస్ ల్ని మీరు ఎంచుకోగలిగినప్పుడు కృత్రిమ జూవెల్లరి ఎందుకు ఎంచుకోవాలి లేదా వెండి జ్యువలరీతో ఎందుకు రాజీపడాలి? తేలిక బరువు గల జూవెల్లరి యొక్క స్టైల్స్ రకాలు భారతదేశంలో ఉత్పన్నమయ్యే సంప్రదాయబద్ధమైన జూవెల్లరి స్టైల్స్ భిన్న రకాలలో లభిస్తున్నాయి. వారు శ్రేష్టతో సమానంగా భారతీయ కళాత్మకతని ఉపయోగిస్తున్నారు. కుందన్, మీనాకారి, జడావు వంటి సంప్రదాయబద్ధమైన జూవెల్లరికి ఉన్న తేలికపాటి బరువు గల రూపం ఎంతో అనుసరించదగినది. వైట్ గోల్డ్, ప్లాటినం ఆధారంగా అన్ని స్టైల్స్ కి చెందిన తేలికపాటి జూవెల్లరిని మీరు కనుగొనగలరు. అదనంగా, మ్యూటెడ్ గోల్డ్ , రోజ్ గోల్డ్ లలో వెర్షన్స్ మన సుసంపన్నమైన మరియు సాంస్క్రతిక హెరిటేజ్ నుండి ప్రేరణ పొందుతున్నాయి. సొగసైన తేలికైన జూవెల్లరి కొన్నిసార్లు సంప్రదాయబద్ధమైన, భారీ ఆభరణాలు ఒక సందర్భాన్ని లేదా దుస్తువుల పై ఆధిపత్యంవహించవచ్చు. అయితే, మీ తేలికైన జూవెల్లరితో మీరు మీ స్నేహితులతో కలిసి మూవీకి వెళ్లినప్పుడు లేదా కార్యాలయానికి వెళ్లినప్పుడు ధరించినట్లయితే సొగసుగా కనిపిస్తారు. నవ్యతని ఇష్టపడే వారికి తేలికైన జూవెల్లరి పరిపూర్ణమైనది. అదనంగా, మీ సొంత వ్యక్తిగత స్టైల్ ని మీరు సృష్టించే సరళతని పొందుతారు. డజన్ల కొద్దీ గాజులు , ఒక దాని పై మరొకటి ఉండే రింగ్స్ తో ప్రయోగం చేయండి మరియు బోహో స్టైల్ ఇవ్వండి. చవకగా లభించే తేలికైన జూవెల్లరి. సంప్రదాయబద్ధమైన, భారీ పీసెస్ కంటే ఈ డిజైన్లు తక్కువ గోల్డ్ ని ఉపయోగిస్తాయి కాబట్టి, అవి జూవెల్లరి ధరల యొక్క వర్గంలో అందుబాటైన ధరలో లభిస్తాయి. సాధారణంలో మాత్రమే ఎందుకు పెట్టుబడి పెట్టాలి? బ్రైడల్ పీసెస్ కంటే కొంచెం తక్కువగా ఉండే నథ్ కోసం చూడండి, మీ స్నేహితుడి జీన్స్ ధరించండి, ఫలితం అందరి కళ్లూ మీ పైనే ఉంటాయి. తేలికైన జూవెల్లరితో మీరు మరిన్ని పీసెస్ ని ప్రదర్శించవచ్చు. పీసెస్ ని కలుపుదాం - 8-10 గ్రా బరువు గల గోల్డ్ నెక్లెస్ మరియు 22 కే స్వచ్ఛత లేదా చెయిన్ తో డైమండ్ పెండెంట్స్. కాబట్టి కాబోయే పెండ్లి కుమార్తె కోసం కూడా, ఒక దాని ధర తో నాలుగు నెక్లెస్ ల్ని కొనుగోలు చేసి ధరించడంలో ఒక అర్థాన్ని ఇస్తుంది. తేలికైన జూవెల్లరి స్టైలింగ్ రూపం 1: రోజులో పాశ్చాత్య దుస్తుల్ని ధరించడానికి ప్రాధాన్యత ఇచ్చే వారి కోసం ఈ రూపం ఉద్దేశ్యించబడింది. ఉదాహరణకు, చొక్కా లేదా టి-షర్ట్ తో , కాజువల్ డ్రెస్ లేదా స్కర్ట్ తో జీన్స్ లేదా ట్రౌజర్స్ లేదా ఉదయం వేళ ఫార్మల్ సూట్ మీరు ధరించవచ్చు. మళ్లీ, సన్నని, వరుసలు గల చెయిన్స్ లేదా పెండెంట్ తో ఉన్న గొలుసుని మేము మీకు సూచిస్తాము. మీ రూపాన్ని అపురూపంగా ఉంచే స్టోన్స్ కోసం చూడండి: రంగుల రాళ్లు మరియు డైమండ్స్ లో రూపొందించబడిన రెండు లేదా మూడు పెండెంట్స్ తో సుమారు 3-4 గ్రాములు బరువు గల రోజ్ గోల్డ్ చెయిన్ మీ రూపానికి వినోదం మరియు సంయమనం చేరుస్తాయి. ఇయర్ రింగ్స్ కోసం మేము స్టడ్స్ ని సూచిస్తాము. అవి మెరుపుని చేరుస్తున్నప్పుడు మీ రూపానికి పాక్షికంగా కాజువల్ ఉద్వేగాన్ని జత చేస్తాయి. అయితే, స్టడెడ్ ఇయర్ రింగ్స్ చిన్నవి అనే కారణంగా వారి అందం విలువ తక్కువగా ఉండదు . రూపం 2: ఉదయం వేళ భారతీయ రూపంలో కనిపించాలని కోరుకునే మరియు మన సమృద్ధియైన, గొప్ప, అందమైన వారసత్వంతో సంబంధాన్ని కలిగిన ప్రజల కోసం ఈ రూపం ఉద్దేశ్యించబడింది. మీ సల్వార్ సూట్ లేదా సౌకర్యవంతమైన డెనిమ్ రూపంతో కుర్తీ, సాధారణ బ్రేస్ లెట్ , ఆధునిక ఇండో-వెస్ట్రన్ స్టైల్ తో మరియు సాధారణ ఇయర్ రింగ్స్ జతతో జోడించాల్సిందిగా మేము సూచిస్తున్నాము. మీరు డిజైన్ లో సమకాలీన, బహుళ సంస్క్రతుల ప్రభావితాలతో మీరు ఫ్యూజన్ బ్రాస్ లెట్ ని ప్రయత్నించవచ్చు. మీ మణికట్టు పై మెరిసే మరియు అందరి దృష్టినీ ఆకర్షించే అందమైన స్టోన్ తో చెక్కబడిన పెండెంట్ తో ఇది లభిస్తోంది. కానీ ఖచ్చితంగా, ఇయర్ రింగ్స్ లేకుండా మీ రూపం పూర్తి కాదు. మేము చిన్న, వేలాడే ఇయర్ రింగ్స్ జతని సూచిస్తాము. ఈ ఇయర్ రింగ్స్ తేలికైనవి కానీ ఇప్పటికీ స్టేట్మెంట్ ని చేస్తుంది మరియు మీ రూపానికి సున్నితమైన అందాన్ని చేరుస్తుంది. పసుపు లేదా తెలుపు గోల్డ్ లో పెరల్ ఇయర్ రింగ్స్ సెట్ జతని మేము సిఫారసు చేస్తాము. రూపం 3: రాత్రి వేళ మెరవడానికి, సున్నితంగా మరియు సుసంపన్నంగా ఉండే మెటీరియల్ తీసుకోండి. మీరు ఎల్ బీడీ లేదా పషిమినా ని ఎంచుకోవచ్చు మరియు మీరు కోరుకునే ఉత్తమమైన ప్రభావం సంచలనం కలిగిస్తుంది. స్టేట్మెంట్ రింగ్స్ మరియు ఇయర్ రింగ్స్ పై దృష్టిసారించాల్సిందిగా మేము సూచిస్తాము. ప్లాటినంలో నీలి రత్నాన్ని ఎంచుకోవడం ద్వారా ఆరుబయట చీకటిని ఉండే వెళ్ళగొట్టడానికి సిద్ధమవ్వండి. ప్లాటినం మరియు స్వరోవ్ స్కి వంటి ఇయర్ రింగ్స్ ని మేము సూచిస్తాము. మీకు చెవులు కుట్టి ఉన్నట్లయితే మరియు కొంచెం నలుపు వంటి దుస్తులతో పూరకం చేసినప్పుడు ఇటువంటి ఇయర్ రింగ్స్ మీ కోసం పరిపూర్ణమైనవి. మరొక సూచన ఏమంటే ప్లాటినంలో వలయాకారపు ఇయర్ రింగ్స్ సెట్. ఈ వలయాకారం ఇయర్ రింగ్స్ లో ఉన్న విలక్షణం ఏమంటే చిన్న డైమండ్లు యొక్క మెరుపుతో అవి మిమ్మల్ని మెరిపిస్తాయి. మీరు వాటిని ధరించినప్పుడు మిమ్మల్ని ప్రత్యేకంగా కనిపించేలా చేస్తాయి. ఒక గదిలోకి ఎవరైనా ప్రవేశించినప్పుడు వారి రాకని ప్రకటించే కాంతిని ప్రతిబింబించే స్టేట్మెంట్ రింగ్ దిగ్గజం అని చెప్పవచ్చు. స్టేట్మెంట్ రింగ్స్ ఆధునిక పోకడ కలిగినవి. ప్రతి వేలికి స్టేట్మెంట్ రింగ్ ని ధరించి కొంతమంది ఆనందిస్తారు కానీ ప్రతి చేతికి ఒకటి లేదా రెండు వాటిని కలిగి ఉండటం కూడా ఉత్తమంగా కనిపిస్తుంది. రూపం 4: రూపం 4: పార్టీలు, పండుగలు లేదా వివాహా సందర్భాలకు చీరలు, లెహంగాలు, మరియు ఆర్భాటమైన సల్వార్ సూట్స్ ధరించడాన్ని ఇష్టపడే వారి కోసం ఈ రూపం ఉద్దేశ్యించబడింది. కానీ మళ్లీ, మీ నెక్లెస్ ని సాధారణంగా ఉంచుతూ, అందమైన షాండ్లియర్ ఇయర్ రింగ్స్ జతని ధరించాల్సిందిగా మేము సూచిస్తున్నాము. ఇవి తేలికైనవి మరియు మీ చెవుల్ని క్రిందకు జారనీయవు. కానీ, అవి అవురూపమైన స్టైల్ మరియు సొగసుని కలిగి ఉండి, మీ సంప్రదాయబద్ధమైన రూపానికి అందాన్ని చేరుస్తున్నాయి. షాండ్లియర్ ఇయర్ రింగ్స్ యొక్క అందం మీ మెడ మరియు చెంపల రూపాన్ని మరింత స్పష్టంగా కనిపించేలా చేస్తాయి, మీకు రాచరికపు రూపాన్ని ఇస్తాయి.
Publisher: Kalyan Jewelers

Can we help you?