Kalyan Jewellers, Chinna Chowk, Kadapa

#39/616/16, Near Apsrtc Bus Stand
Kadapa- 516002

040-67263318

Call Now

Opens at

<All Articles

వింటేజ్ పోకడలు: అవి మళ్లీ వస్తున్నాయా?

ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఇంతకంటే విసుగు కలిగించే, అతిశయంగా ఉండే పదబంధం ఇంగ్లిష్ భాషలో ఉండకపోవచ్చు, కానీ ఈ వ్యాఖ్యానంలో ఇప్పటికీ వాస్తవం ఉంది. ముఖ్యంగా ఫ్యాషన్ పరిశ్రమలో తక్షణమే పోకడలు మారుతుండే నేపధ్యంలో, కంటికి కనిపించకుండా తమ గమనంలో ఉన్న పోకడలు కొంత కాలం తరువాత మళ్లీ ప్రసిద్ధి చెందుతాయి.

వింటేజ్ జ్యూయలరీ విషయంలో, మన పూర్వీకులు ఉపయోగించిన జ్యూయలరీ స్టైల్ నేడు ఒక పోకడగా మారడం సహజం. కళాకారులు సూక్ష్మాతి సూక్ష్మంగా చేసిన చేతి పని డిజైన్లు మరియు జ్యూయలరీస్ ని శాశ్వతమైన అందంగా చేయడమే దీనికి కారణం. ఒక మహిళ హృదయానికి అటువంటి జ్యూయలరీ చేరువ అవడానికి మరొక ముఖ్యమైన కారణం బంగారంలోని ప్రతీ అణువులో నేసిన సెంటిమెంట్లు ఒక తరం నుండి మరొక తరానికి సంక్రమిస్తుండటం. అరుదైన యాంటిక్ డిజైన్లతో పాటు, జ్యూయల్స్ ప్రతీ మహిళ యొక్క అమ్మ/నానమ్మ, అమ్మమ్మలు యొక్క తియ్యని జ్ఞాపకాల బరువుని మోస్తాయి. నేటి ప్రపంచంలో ఫ్యాషన్ గా పేరు పొందిన కొన్ని ప్రసిద్ధి చెందిన వింటేజ్ జ్యూయలరీస్ ని మనం చూద్దాం.

స్వచ్ఛమైన, రా డైమండ్ చంక్స్ ని ఉపయోగించే పోల్కి వంటి అన్ కట్ జ్యూయలరీస్ గొప్ప చోకర్స్ మరియు నెక్లెస్ లో కళాత్మకంగా రూపకల్పన చేయబడి నేటి పెండ్లి కుమార్తెకు ఒక మంచి ఎంపికగా మారాయి. ఎందుకంటే పోల్కి జ్యూయలర్స్ సాధ్యమైనంత అందమైన విధానంలో ప్రతీ ఒక్కరి దృష్టి పెండ్లి కుమార్తె వైపే ఉండేలా చేస్తాయి.

మహిళలు ఎల్లప్పుడూ మెచ్చే మరొకటి ఝుంకా/జింకి/కోడా కడుక్కన్. చాలా శతాబ్దాలుగా భారతదేశంలో ఉపయోగించబడుతున్నాయి. ఈ రకమైన ఇయర్ రింగ్స్ నిజంగా శాశ్వతమైనవి. ఎందుకంటే ఇవి ఆరంభమైన నాటి నుండి అన్ని కాలాల్లో మహిళలు అత్యంతగా ప్రేమించే జ్యూయలరీ ఇవి. చాలామంది సృష్టికర్తలు మరియు ఫ్యాషనిస్ట్ లు సాధారణ ఝుంకాని వివాహాలు నుండి రోజూ ధరించడం వరకు, వెస్ట్రన్ దుస్తులు పై కూడా ధరించడానికి అనుకూలమైన విధంగా మార్పులు చేసారు.

కడా బ్యాంగిల్స్ అనగా డైమండ్లు, విలువైన రాళ్లు పొదిగిన పెద్ద బంగారం గాజులు. అవి చాలా పెద్దవి మరియు సాధారణంగా జతల్లో లేదా కేవలం ఒకటిగా ధరిస్తారు. మహిళలు తమ చేతులకు సన్నని గాజులు అలంకరించడాన్ని ఇష్టపడే రోజులకు కాలం చెల్లింది. మినిమలిస్టిక్ కానీ సంపూర్ణమైన జ్యూయలరీ కాలం మహిళల్లో కడా బ్యాంగిల్స్ కోసం ప్రేమని కలిగించాయి.

నేటి మహిళలు ఇష్టపడే మరొక అంశం ముక్కు పుడక. భారీగా అలంకరించిన ముక్కు పుడకలు నుండి స్టార్ వలే అమర్చిన చిన్న డైమండ్ ముక్కు పుడకలు, పాశ్చాత్య డిజైన్లు వరకు ముక్కు పుడకలు అన్ని నమూనాల్లో పోకడగా నిలిచాయి.

మాంగ్ టిక్కా అనగా పాపిట గొలుసు సాధారణంగా ఒక అంగుళం పొడవు ఉండే అలంకారయుతమైన బంగారం పెండెంట్. కొన్నిసార్లు డైమండ్లు సూక్ష్మమైన డిజైన్ లో అమర్చబడతాయి. ఇది వివాహిత మహిళ మంగళ సూత్రంలో రూపొందించబడుతుంది. ప్రధానంగా ఉత్తరాది మహిళలు ధరిస్తారు. ఈ రకమైన జ్యూయలరీ ఇప్పుడు భారతదేశపు అందరు మహిళల్లో కూడా అభిమాన జ్యూయలరీగా మారింది.

వింటేజ్ మరియు యాంటిక్ జ్యూయలరీ విషయంలో భారతీయ సంపదలో ఎన్నో అతుల్యమైన డిజైన్లు ఉన్నాయి. పూర్తి జాబితా అనంతమైనది కావున అత్యంత ప్రసిద్ధి చెందిన వాటిని నేను ఈ వ్యాసంలో చేర్చాను.

Can we help you?